రాయదుర్గం: కన్నీటిసంద్రంగా మారిన సంజీవరాయుని కోట
ఒకేరోజు ముగ్గురు మృతితో అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలం సంజీవరాయుని కోట కన్నీటిసంద్రంగా మారింది. పాముకాటుతో కుమారుడు పవన కుమార్ రెడ్డి చనిపోగా, ఆసుపత్రికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మల్లికార్జునరెడ్డి, కారు డ్రైవర్ చందు మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం వారి అంత్యక్రియలు జరగగా, గ్రామస్తులు, బందువులు, ప్రముఖుల రోదనల మధ్య వారి అంతిమయాత్ర సాగింది. వీరికి వేలాది మంది కడసారి వీడ్కోలు పలికారు. ముగ్గురి మరణం గ్రామానికి తీరనిలోటని నివాళులు అర్పిస్తూ పలువురు కంటతడిపెట్టారు.