ఉరవకొండ: జిల్లా, మండల ప్రాదేశిక ఎన్నికల్లో బెళుగుప్ప మండల వ్యాప్తంగా నిలిచిన 27 మంది అభ్యర్థులు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల వ్యాప్తంగా జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ ఎన్నికల్లో మొత్తం 27 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం జడ్పిటిసి అభ్యర్థులుగా టిడిపి తరఫున ప్రవీణ్, వైయస్సార్సీపి తరఫున నరేంద్రబాబు నిలిచారు. బెలుగుప్ప మండల వ్యాప్తంగా ఉన్న 12 ఎంపీటీసీల పరిధిలో ప్రధాన పార్టీలు టిడిపి వైయస్సార్సీపి తరఫున 24 మంది, ఒక కాంగ్రెస్ అభ్యర్థి బరిలో నిలిచారని మండల ఆర్వో ప్రసాద్ తెలిపారు.