కొండపి: సింగరాయకొండ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థి అనుమానస్పద మృతి, మృతుడి తల్లి పాఠశాల ముందు నిరసన
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తౌశిక్ అనే ఆరో తరగతి విద్యార్థి అనుమానస్పద మృతి చెందాడు. తల్లితండ్రుల అనుమానం మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే తన కొడుకుది ఆత్మహత్య కాదని తన బిడ్డ మృతి పై న్యాయం చేయాలని విద్యార్థి తల్లి గత 4 రోజులుగా నిరసన కార్యక్రమం చేపట్టింది. జనవరిలో విద్యార్థి హాస్టల్ లోని బాత్రూంలో ఉరివేసుకొని మృతి చెందాడు.