ఉరవకొండ: దుద్దెకుంట గ్రామంలో రైతు పుల్లయ్య పాము కాటుకు గురై మృతి చెందారు.
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని దుద్దెకుంట గ్రామంలో రైతు పుల్లయ్య (69).బుధవారం పాము కాటుకు గురై మృతి చెందారు. బంధువులు పోలీసులు తెలిపిన వివరాలు మేరకు మృతుడు వ్యవసాయ తోటలో సాగుచేసిన వేరుశెనగ పంటను కూలీలతో కలసి తొలగిస్తుండగా చేతికి పాము కాటే సింది. చికిత్స నిమిత్తం తొలత ఆత్మకూరుకు అనంతరం 108వాహనంలో అనంతపురం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందారు. మృతుడికి భార్య రామాంజినమ్మ ఒక కుమారుడు ఇద్దరుకుమార్తెలు సంతానం గలదు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ కుటుంబసభ్యులు కోరుతున్నారు