సంతనూతలపాడు: చీమకుర్తిలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గ్రానైట్ క్వారీ మూసివేత
చీమకుర్తిలోని దర్శి MLA బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డికి చెందిన గ్రానైట్ క్వారీని గురువారం మూసివేశారు. ఇటీవల విజిలెన్స్, మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌కు పాల్పడ్డారంటూ రూ.78 కోట్ల జరిమానా విధించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో క్వారీ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తడంతో కార్మికులకు చెల్లింపులు పూర్తిచేసి, యాజమాన్యం క్వారీని మూసివేసింది. దీంతో సుమారు 350 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.