కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెంను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ ధర్నా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని, పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట సీపీఐ భారీ నిరసన తెలిపింది. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.