గార్ల: మహబూబాబాద్: కోతుల దాడితో పంట నష్టపోయిన రైతు.. ఆవేదనలో స్థానికులు
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరులో కోతుల బెడద పెరిగింది. రెండున్నర లక్షల పెట్టుబడి పెట్టిన రైతు వీరన్న మిరప, పత్తి పంటలు కోతుల దాడితో ధ్వంసమయ్యాయి. ఇళ్లలోకి వచ్చి వస్తువులు ఎత్తుకెళ్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కోతుల బెడదను నివారించాలని కోరుతున్నారు.