గూడూర్: యాసంగిలో వరి సాగు వద్దు: రైతులను హెచ్చరించిన కలెక్టర్ స్నేహ శబరిష్
మహబూబాబాద్ జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో వరి సాగును నిలిపివేయాలని కలెక్టర్ స్నేహ శబరిష్ రైతులకు సూచించారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేయాలని, ప్రభుత్వం అందించే సదుపాయాలను వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు.