డోర్నకల్: హూన్య తండాలో నాటుసారాయి తయారీ కేంద్రంపై పోలీసుల దాడి
డోర్నకల్ మండలం హూన్య తండాలో నాటుసారాయి తయారు చేస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 30 లీటర్ల గుడుంబా, 500 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో సుమారు 60 వేల రూపాయల విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు.