గిద్దలూరు: రాచర్ల మండలం చోళవీడు గ్రామంలో నీటి సమస్య పరిష్కారానికి నూతనంగా నిర్మించిన నీటి బోరుని ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డ
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం చోళవీడు గ్రామంలో నీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఇటీవల నిర్మించిన నూతన నీటి బోరుని ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఇటీవల నీటి సమస్య అత్యధికంగా ఉన్నా నేపథ్యంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకుంటూ జాగ్రత్తలు పాటించాలన్నారు. గిద్దలూరు పట్టణంలో నీటి సమస్య పరిష్కారానికి మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.