రాప్తాడు: రాప్తాడు మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో సమయపాలన పాటించని అధికారులు ఇబ్బందులకు గురవుతున్న సమస్యలపై వచ్చే ప్రజలు
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల కేంద్రంలో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఎంపీడీవో కార్యాలయంలో ఏ ఒక్క అధికారి కూడా సమయపాలన పాటించకుండా విధులకు హాజరు కావడం లేదు. ఈ సందర్భంలోనే సమస్యలపై వచ్చే ప్రజలు అధికారులు రాక గంటలకు అధికారుల కోసం ప్రజలు వేచి ఉండాల్సి వస్తుంది 11 గంటల తర్వాత వచ్చే అధికారులు మధ్యాహ్నం మూడు గంటలు అవుతూనే ప్రజల సమస్యలు పట్టకుండా ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు ఇళ్లకు వెళ్లిపోతున్నారు దీంతో ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి ప్రజలు అధికారులు లేక పనులు జరగక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.