ఉరవకొండ: ఉదిరిపికొండలోని రైతు పొలంలో చీనిచెట్లు నరికివేసిన ఘటనతో కలకలం
అనంతపురం జిల్లా కూడేరు మండలం ఉదిరిపికొండలో ఓ రైతు పొలంలో చీనిచెట్లు నరికివేసిన ఘటన గురువారం కలకలం రేపింది. కొందరు టీడీపీ నేతలే తమ చెట్లను నరికివేశారని బాధిత రైతు మల్లికార్జున ఆరోపిస్తున్నారు. గాలి మరలకు సంబంధించిన దారి విషయంలో మొదలైన వివాదం ముదిరి చివరకు ఇలా చెట్ల నరికివేతకు దారి తీసిందని వాపోతున్నారు. చీనీ చెట్లు నరికివేత విషయమై కూడేరు పోలీసులకు పిర్యాదు చేసినట్లు రైతు పేర్కొన్నారు.