ఉరవకొండ: నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం నీట మునిగిన పంటలు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో ఆదివారం తెల్లవారుజాము నుండి ఉదయం 9 గంటల వరకు కురిసిన వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికే సాగు చేసిన కంది, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి. పలుచోట్ల పంట పొలాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఉరవకొండ, ఛాయాపురం, పొలికి, పెంచలపాడు, నక్కలపల్లి తదితర వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.ఉరవకొండ-62.2, కూడేరు- 32.4 బెలుగుప్ప- 48.6, వజ్రకరూరు- 55.2 విడపనకల్లు-39.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.