రాయదుర్గం: వడ్రహొన్నూరు పొలాల్లో చిరుత సంచారం
రాయదుర్గం మండలం వడ్రహొన్నూరు గ్రామ పొలాల్లో చిరుత కనిపించి కలకలం రేపింది. నాయకుల మదు అనే రైతు పెద్ద వంక పక్కన వేరుశెనగ పొలంలో పని చేస్తుండగా వంకలో అలజడి వినిపించింది. వెళ్లి చూడగా గడ్డిలో నుంచి చిరుత పరుగెత్తుతూ వెళ్లింది. ఈ దృశ్యాన్ని పక్కనే ఉన్న గొర్రెల కాపరి వీడియో తీశాడు. ఫారెస్టు అధికారి దామోదర్ మాట్లాడుతూ నిన్న మురడి వద్ద కూడా ఇదే చిరుత కనిపించిందని, కొండ వెంబడి సంచరిస్తుండవచ్చని తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.