రాప్తాడు: ప్రసన్నాయిపల్లిలో రాప్తాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ లో అనుమానాస్పద వ్యక్తులు ఇల్లు తనిఖీ
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నయిపల్లి గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటలకు రాప్తాడు ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రసన్నాయిపల్లి ఫ్యాక్షన్ గ్రామంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి అనుమానాస్పద సంబంధించిన ఇండ్లను వాహనాలను పరిసరాలన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందని గ్రామాల్లో ప్రజల్లో ప్రశాంతంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు సహకారం అందించాలని రాప్తాడుసర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.