సంతనూతలపాడు: మద్దిపాడులో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్వాడి ఉత్సవ్ కార్యక్రమం
మద్దిపాడు లో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో స్థానిక అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు, బాలింతలు, గర్భవతులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార వినియోగం గురించి సూపర్వైజర్ పద్మావతి వివరించారు. జింక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని ఆమె సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.