నారాయణపేట్: కొస్గిలో 20న 'పాంచ జన్య సంకల్ప సభ': హాజరుకానున్న కల్వకుంట్ల కవిత
నారాయణపేట జిల్లా కొస్గిలో ఈ నెల 20న తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పాంచ జన్య సంకల్ప సభ జరగనుంది. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు గవినోళ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.