కొండపి: మర్రిపూడి మండలం చిల్లంకూరు గ్రామ పరిసర ప్రాంతాలలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం చిల్లంకూరు గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.48,020 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశామని పేకాట ఆడటం చట్టరీత్య నేరముని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా పేకాటాడుతున్నట్టు ప్రజలు గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.