యర్రగొండపాలెం: త్రిపురాంతకం మండలంలో సమృద్ధిగా వర్షాలు పడాలని గంగమ్మ పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం మేడేపి గ్రామంలో తీవ్ర కరువు పరిస్థితి నెలకొన్నదని సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ పోలేరమ్మ గంగమ్మ తల్లికి రైతులు నీళ్లు పోసి మొక్కుకున్నారు. అమ్మవార్లకు 101 బిందెలు నీళ్ళు పోశారు. అనంతరం అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేసి కాయ కర్పూరం సమర్పించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.