కొండపి: విద్యార్థి పై జరిగిన లైంగిక దాడి ఘటనపై స్పందించిన వైసిపి నాయకులు, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన్న వైసీపీ నాయకులు
ప్రకాశం: రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని వైసిపి మహిళ నేతలు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జరుగుమల్లి బిసి హాస్టల్ కు చెందిన విద్యార్థి పై లైంగిక దాడి జరిగి ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నాయకులు పరామర్శించేందుకు వెళ్లారు. అనుమతి నిరాకరించడంతో అసహనం వ్యక్తం చేసిన వైసిపి నాయకులు ఏమీ జరగకపోతే తమని ఎందుకు మాట్లాడనివ్వడం లేదని వైసిపి నాయకులు నిలదీశారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ మహిళా భద్రతను పట్టించుకోవడంలేదని ఆరోపించారు.