అనంతపురం జిల్లాలోనే తాడిపత్రిలో అత్యధికంగా 43.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. 43.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ చెప్పారు. భారీ వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం తలెత్తింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో జనాలు జాగరణ చేయాల్సి వచ్చింది.