తాడిపత్రిలోని నందలపాడు వాటర్ హౌస్ ప్రాంతంలో సోలార్ ప్లాంట్ నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జే సీ ప్రభాకర్ రెడ్డి లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జే సీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. సోలార్ ప్లాంట్ నిర్మాణానికి రూ.4.10 కోట్లు మంజూరయ్యాయన్నారు. సోలార్ ప్లాంట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయిస్తామన్నారు. సోలార్ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే మున్సిపాలిటీకి ఇక విద్యుత్తు అవసరాలు ఉండవన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.