నా శత్రువులు సైతం నన్ను పొగడాలి అదే నా కల అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జే సీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన మాట్లాడారు. నేను చనిపోయాక ప్రజలు ప్రభాకర్ రెడ్డి అనే వాడు ఒకడు ఉండేవాడు అంట వాడు అన్ని పనులు అలాంటి వాడు ఒకడు ఉంటే చాలు అనుకోవాలి అన్నారు. అదే నా కల, అదే నా స్వప్నం అన్నారు. తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం నయా పైసా ఇవ్వలేదన్నారు. ప్రజల సహాయం, మా కష్టంతో ముందుకెళ్తున్నామన్నారు. ఎంత కష్టమైనా ఎదుర్కొని మున్సిపాలిటీ రూపు రేఖను మారుస్తానన్నారు.