యాడికి లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు (తిరుణాల) సందర్భాన్ని పురస్కరించుకొని టెంకాయల విక్రయానికి శుక్రవారం వేలంపాట నిర్వహించారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ఆవరణలో ఈవో దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. వేలం పాటలో మాస నాగేంద్ర అనే వ్యక్తి రూ.2,41,116 లకు టెంకాయల విక్రయ హక్కును దక్కించుకున్నాడు. ఈనెల 24 నుంచి మార్చి 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.