రాప్తాడు: చిన్మయి నగర్ లో నిషాముక్ యువ ఫర్ వికాసిత్ భారత్ త్రీ కే హెల్త్ వాక్ వాల్ పోస్టులను ఆవిష్కరించిన JNTU VC సుదర్శన్ రావు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయ నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయంలో బుధవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఉపకులపతి సుదర్శన్ రావు వికసిత్ భారత్ త్రీ కే హెల్త్ వాక్ వాల్ పోస్టులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రావు మాట్లాడుతూ అక్టోబర్ 1న నెహ్రూ యువ కేంద్రం ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం మేరా యువభారత్ ఈగల్ సెల్ ఆధ్వర్యంలో నిషాముక్త్ ఫర్ వికాసిత్ భారత్ త్రీ కే హెల్త్ వాక్ ఉదయం 6 గంటలకు జేఎన్టీయూ నుంచి త్రీ కే హెల్త్ వాక్ ను నిర్వహించబోతున్నామని ముఖ్యంగా యువత మారకద్రవ్యాలు వినియోగించకూడదని ఉద్దేశంతోనే వాక్ నిర్వహించబోతున్నామని ఉపకులపతి సుదర్శన్ రావు పేర్కొన్నారు.