అడ్డ గూడూరు: యాదాద్రి భువనగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా కంచనపల్లి వద్ద ఆర్టీసీ అద్దె బస్సు బైకును ఢీకొనడంతో ఊర సోమన్న అనే వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బాధితులు రాఘవాపురంలో కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.