అడ్డ గూడూరు: లక్ష్మీదేవి కాల్వ గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని లక్ష్మీదేవి కాల్వ గ్రామంలో చిగుళ్ల వెంకన్న ఎద్దు విద్యుత్ షాక్ తో శుక్రవారం మృతి చెందింది. రైతు వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రోజువారీగా మేతకు ఎడ్లను మేపుతుండగా ,సాయంత్రం వర్షం రావడంతో ట్రాన్స్ఫార్మర్స్ దగ్గరగా మేస్తున్న ఎద్దు విద్యుత్ షాక్ తో మృతిచిందని వాపోయారు.