అడ్డ గూడూరు: రైతులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది: జోజి
యాదాద్రి భువనగిరి జిల్లా, అడ్డగూడూరు మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నిమ్మగోటి జ్యోతి మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా రైతులు ఎదురుచూస్తున్న భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది అన్నారు. గతంలో రైతులు ధరణి ద్వారా అనేక ఇబ్బందులు పడ్డారని, వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెచ్చింది అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, డిప్యూటీ తాసిల్దార్ పాల్గొన్నారు.