అడ్డ గూడూరు: దళిత బంధు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే మందుల సామేలుకు దళిత బందు లబ్ధిదారులు వినతి
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో మోత్కూర్,అడ్డగూడూర్ మండలాలకు సంబంధించిన దళిత బంధు లబ్ధిదారులు ఎమ్మెల్యే మందుల సామేలుకు దళిత బంధు నిధులు విడుదల చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా దళిత బంధు లబ్ధిదారులు బాలెముల నరేందర్ ,విద్యాసాగర్ పలువురు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు మేలు చేసే విధంగా దళిత బంధువులు తీసుకువచ్చిన దళిత బంధు పథకం నిధులను కేటాయించిందని ,బిఆర్ఎస్ ప్రభుత్వం పై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు నిధులు విడుదల చేసి దళితులను ఆదుకోవాలన్నారు.