అడ్డ గూడూరు: అడ్డగూడూరు మండల పరిధిలోని గోవిందపురం మధ్యలో ఉన్న నక్కల వాగు పరిశీలన: సిపిఎం జిల్లా కార్యదర్శి జహంగీర్
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూర్ మండలంలో సీపీఎం నాయకులు సాయంత్రం 04:00గంటలకు పర్యటించారు. ఈ సందర్భంగా అడ్డగూడూరు మండల పరిధిలోని గోవిందపురం గ్రామంలో మధ్యలో ఉన్న నక్కలా వాగును సీపీఎం జిల్లా కార్యదర్శి యం. డి జహంగీర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ గోవిందాపురం వద్ద బ్రిడ్జిని ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు,జిల్లా కమిటీ సభ్యులు మదేపురం రాజు ,సీపీఎం మోత్కూర్ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు,సీపీఎం అడ్డగుడూర్ మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.