రాయదుర్గం: నెలనెలా టంచనుగా పెన్షన్ అందజేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం : పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, మంచానికే పరిమితమైన అభాగ్యులకు నెలనెలా టంచనుగా పెన్షన్లను అందజేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అని రాయదుర్గం MLA కాలవశ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం పట్టణంలోని తహసీల్దార్ రోడ్డులో ఎన్టీఆర్ బరోసా పెన్షన్ల పంపిణీలో ఆయ పాల్గొన్నారు. లభ్థిదారులకు పెన్షన్ నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతోపాటు పలువురు టిడిపి మైనార్టీ నాయకులు మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న చంద్రబాబు ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, డిఈ సురేష్, టిడిపి నాయకులు పాల్గొన్నారు.