ఉరవకొండ: పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద ఉట్ల మానోత్సవం
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం ఉట్ల మానోత్సవం వైభవంగా నిర్వహించారు ఆమిద్యాల గ్రామం నుంచి స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఉదయం పెన్నహోబిలం క్షేత్రానికి చేరుకున్నాయి. సాయంత్రం నాలుగు గంటల నుండి దేవస్థాన ప్రాంగణంలో మానోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం సాయంత్రం అమిద్యాలలో ఉట్ల మానోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రేగటి నాగరాజు కమిటీ సభ్యులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు.