అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలోని గ్రామాల్లో గుంతకల్ డివిజన్ లీగల్ మెట్రాలజీ అధికారి శంకర్ సోమవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. మండలంలోని బెలుగుప్ప, వెంకటాద్రి పల్లి, శిర్పి, గుండ్లపల్లి గ్రామాలలో లీగల్ మెట్రాలజీ అధికారి బేకరీ, హార్డ్వేర్ షాపులల్లో తనిఖీలు చేసి బెలుగుప్ప గ్రామంలోరెండు హార్డ్వేర్ షాపుల్లోను, రెండు కిరాణా దుకాణాలల్లో , అలాగే బేకరీలో మెట్రాలజీ చట్టం నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల నాలుగు షాపులకు రూ. 5000 చొప్పున, బేకరీ పై రూ.3000 మొత్తం 23 వేల రూపాయల అపరాధ రుసుము విధించామని లీగల్ మెట్రాలజి అధికారులు పేర్కొన్నారు.