ఒంగోలు: ఒంగోలులో పోలీసుల విస్తృత తనిఖీలు: విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఒంగోలులో టాస్క్ ఫోర్స్, ఈగల్ టీం సిబ్బంది విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేయడంతో పాటు, విద్యాసంస్థల వద్ద విద్యార్థులకు గంజాయి, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అధికారులు అవగాహన కల్పించారు.