ఒంగోలు: ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో జరుగుతున్న సదరన్ క్యాంపును పరిశీలించిన డీఎంహెచ్వో టి. వెంకటేశ్వర్లు
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, డి.సి.హెచ్.ఎస్ డాక్టర్ సూరిబాబు ఒంగోలు సర్వజన ఆసుపత్రి లోని సదరన్ క్యాంపు జరుగు సైకియాట్రీ మరియు ఎముకలు కీళ్ల విభాగమును గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. సదరన్ క్యాంపుకు వచ్చు రోగులకు అందుతున్న వైద్య సేవలు, సదుపాయములపై విచారించి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. రోగుల వివరములను ఆన్లైన్ లో పరిశీలించి వారికీ సత్వర వైద్యసేవలు అందించి సకాలములో వారిని వారి స్వగ్రామములకు పంపాలని తెలిపారు. క్యాంపునకు వచ్చు రోగులకు అందించు సేవలపై ఎటువంటి నిర్లక్షము వహించరాదని సిబ్బంది అందరు అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు.