ఒంగోలు: కొత్త మార్కెట్ చిరు వ్యాపారుల సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలి - సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు
ఒంగోలు కొత్తమార్కెట్ చిరు వ్యాపారుల సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు కోరారు. చిరువ్యాపారుల ఆందోళన నేపథ్యంలో ఎంఎల్ఏ దామచర్ల జనార్దన్ రావు ఇచ్చిన హామీ మేరకు గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యాపారానికి అనువుగా లేనందున, షాపుల ముందు తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారని తెలిపారు. కోవిడ్ సమయంలో వ్యాపారులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఎంఎల్ఎ ఇచ్చిన హామీ మేరకు సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.