ఒంగోలు: సరళాదేవి నగర్ వాసులకు ఇళ్ల పట్టాలి ఇవ్వాలి - సిపిఐ జిల్లా కార్యదర్శి ML నారాయణ డిమాండ్
ఒంగోలు నగర పరిధిలోని పేర్నమిట్టలో 48 వ డివిజన్ పరిధిలోని సరళాదేవి నగర్ వాసులకు వెంటనే నివేశిత పట్టాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ML నారాయణ డిమాండ్ చేశారు. సరళాదేవి నగర్ సిపిఐ జనరల్ బాడీ సమావేశానికి గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. సరళా దేవినగర్ వాసులు గత 20సంవత్సరాలకు పైగా వివాద రహిత భూమిలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ప్రభుత్వం ఈపాటికి భూములేని పేదలకు నివేశిత స్థలాలు ఇస్తామని ప్రకటన చేసిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సరేనా దేవి నగర్ వాసులకు వారు నివాసం ఉంటున్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలన్నారు.