ఒంగోలు: రానున్న పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు వచ్చే విధంగా కృషి చేయాలి - దామచర్ల నాగసత్యలత
ఒంగోలులోని సాయి ఐటిఐ కన్వెన్షన్ హాల్లో శ్రీ సాయిరాం జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి దామచర్ల నాగ సత్యలత ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చిన్నతనం నుండి లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా కషి చేయాలన్నారు. రానున్న పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అలరించాయి.