ఒంగోలు: జిల్లాలో మలేరియా కేసులు నియంత్రించేందుకు చర్యలు - జిల్లా మలేరియా నివారణ అధికారి మధుసూదన్ రావు
జిల్లాలో మలేరియా కేసులు నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా మలేరియా నివారణ అధికారి మధుసూదన్ రావు తెలిపారు. బుధవారం సాయంత్రం ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు జిల్లాలో క్షేత్రస్థాయిలో మలేరియా నివారణకు చర్యలు చేపట్టామన్నారు. దోమల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందకుండా గ్రామస్థాయిలో సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.