ఒంగోలు: ప్రజల మన్ననలు పొందుతూ మెరుగైన పోలీసింగ్ సేవలు అందించటమే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలి: ఎస్పీ ఏఆర్ దామోదర్
ప్రజల మన్ననలు పొందుతూ మెరుగైన పోలీసింగ్ సేవలు అందించటమే లక్ష్యంగా గురువారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో జిల్లా ఎస్పీ దామోదర్ పోలీస్ కార్యాలయంలో నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళా పిర్యాదుదారుల పట్ల పాటించవలసిన ప్రవర్తన, ఫిర్యాదుల స్వీకరణ, వాటి సత్వర పరిష్కారం తదితర అంశాలపై దిశా నిర్ధేశం చేసారు. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ అనే బోర్డులను ఏర్పాటు చేయాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.