ఒంగోలు: కాపు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి - కాపు సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సంజీవ కుమార్
కాపు కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకం కింద ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ రుణాలను కాపు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షులు కొక్కిరాల సంజీవకుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. బలిజా తెల్లగా కాపు కులాల వారు కాపు కార్పొరేషన్ ద్వారా రెండు లక్షల నుంచి 5 లక్షల వరకు 50 శాతం సబ్సిడీతో కూడిన రుణాల కొరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏడవ తేదీ ఆకువ తేదీ కావడంతో అర్హత కలిగిన వారు తమ ఏరియాలోని సచివాలయంలో కాని మీసేవా కేంద్రాల్లో గాని దరఖాస్తు చేసుకోవాలన్నారు.