ఒంగోలు: కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తుల సమస్యలపై సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
మార్కెట్ లో నిర్ణయించిన రేట్లు ఆన్లైన్ వచ్చేవి మాత్రమేనని రూల్స్ కు విరుద్ధంగా తమేమి చేసే పరిస్థితి ఉండదని, కోవిడ్ సమయంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి ముఖ్యమంత్రి తో మాట్లాడి పరిష్కరిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు కూరగాయల మార్కెట్ లోని వ్యాపారస్థుల సమస్యలపై ఏర్పాటు చేసిన ప్రత్యేకసమావేశం లో గురువారం మధ్యాహ్నం వ్యాపారస్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు. గత ఐదేళ్లు రెంట్లు కట్టక పోవడం వల్ల కార్పొరేషన్ కు 17 కోట్ల బకాయిలు పేరుకు పోయాయని, ఈనష్టం ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. ఈ బకాయిలు దశలవారీగా కట్టుకునే సౌలభ్యం కల్పిస్తామన్నారు.