రాయదుర్గం: ఘనంగా ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ 16వ ఆవిర్భావ దినోత్సవం
ప్రతి పౌరుడు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు తెలుసుకుని చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, అప్పుడే అవినీతి, అక్రమాలు లేని సమాజం సాధ్యమని ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అయ్యంకి సురేష్ బాబు అన్నారు. బుధవారం రాయదుర్గంలో రీజియన్ అధ్యక్షుడు బొమ్మిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో సంస్థ 16వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సురేష్ బాబు మాట్లాడుతూ భారత న్యాయ సంహత, వినియోగదారుల రక్షణ చట్టం, సమాచార హక్కు చట్టాలపై అవగాహన పెంచుకుని అన్యాయాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. గత 16 ఏళ్లుగా తమ సంస్థ ప్రజలను చైతన్యం చేస్తోందని తెలిపారు.