కనిగిరి: బీసీల 34 శాతం రిజర్వేషన్లను హైకోర్టుకు వెళ్లి వైసిపి అడ్డుకుంది: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి : కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సంకల్పిస్తే , వైసీపీ కోర్టుకు వెళ్లి రిజర్వేషన్ల ప్రక్రియను కొట్టి వేయించడం జరిగిందని కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం కనిగిరిలో జరిగిన ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ... బీసీ రిజర్వేషన్లను హైకోర్టు కొట్టి వేసినా సీఎం చంద్రబాబు బీసీలకు న్యాయం జరగాలని సుప్రీంకోర్టుకు వెళ్లారని ఎమ్మెల్యే తెలిపారు. బీసీలకు ఎప్పుడు టిడిపి అండగా ఉందని, కూటమి ప్రభుత్వంలో వారికి అన్యాయం జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు.