రాప్తాడు: అనంతపురంలో చెన్నై కొత్తపల్లి జనసేన పార్టీ నేతలతో సమావేశమై జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థుల ఎంపికపై చర్చించిన ఎమ్మెల్యే పరిటా
అనంతపురం జిల్లా కేంద్రంలో శనివారం నాలుగున్నర గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంప్ కార్యాలయంలో చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన జనసేన పార్టీ నేతలతో సమావేశమై ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థుల ఎంపికపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ చెన్నై కొత్తపల్లి మండల కన్వీనర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ చెన్నై కొత్తపల్లి మండలానికి సంబంధించిన ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థుల ఎంపిక గురించి ఎమ్మెల్యే పరిటాల సునీతతో చర్చించడం జరిగిందని భవిష్యత్తులో ఎన్నికల గెలుపుపై తామంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెన్నై కొత్తపల్లి జనసేన పార్టీ మండల కన్వీనర్ క్రాంతికుమార్ పేర్కొన్నారు.