కనిగిరి: త్రిపురాంతకం నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్ కుమార్ మీనా
త్రిపురాంతకం ఎంపీడీఓ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.