రాయదుర్గం: టిడిపి నాయకులు పెద్ద మనసు చేసుకొని చైర్మన్ సీటు బిజెపికి కేటాయించాలి : రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి
రాయదుర్గంలో బిజెపి బలంగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద మనసు చేసుకొని రాయదుర్గం మున్సిపల్ చైర్మన్ సీటు బిజెపికి కేటాయించాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కోరారు. ఆదివారం రాయదుర్గంలో ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో కూటమి అభ్యర్థులను సమిష్టిగా గెలిపించుకునేందుకు టిడిపి, బిజెపి, జనసేన నుంచి ముగ్గురు చొప్పున సభ్యుల కమిటీ ఏర్పాటు అయిందన్నారు. రాయదుర్గం సీటు తమకు కేటాయించాలని కోరామని తెలిపారు.