గిద్దలూరు: రాచర్ల మండలం జెపి చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులిని చంపిన ఘటనలో ఏడుగురు అరెస్ట్
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జెపి చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులిని వేటాడి నాటు తుపాకీతో కాల్చి చంపిన ఏడుగురిని మంగళవారం గిద్దలూరు అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వేటగాళ్ల వద్ద నుంచి ఒక నాటు తుపాకీ, ఏడు కాలి గోర్లు, ఒక గొడ్డలి, కాలి ఎముకలను. అటవీ శాఖ అధికారులు నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతూనే ఉందని డిప్యూటీ డైరెక్టర్ నిషా కుమారి అన్నారు. నిందితులను కోర్టుల ప్రవేశపెడుతున్నట్లు ఆమె వెల్లడించారు.