కొత్తగూడెం: పాల్వంచలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి: ఇద్దరు అరెస్ట్, నగదు స్వాధీనం
పాల్వంచ మండలం పునుకుల శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై రూరల్ పోలీసులు దాడి చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 1,400 రూపాయలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నలుగురు వ్యక్తుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.