యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్టు వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేసేందుకు ఆగస్టు 30వ తేదీన సీఎం చంద్రబాబు రానున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ విజయ సునీత స్థానిక టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు తో కలిసి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించిన అధికారులు చేపడుతున్న పనులు సభా ప్రాంగణం ఏర్పాట్లపై ఆరా తీశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.